ఓ ‘ఇంటి’వాడైన సుడిగాలి సుధీర్!
ఓ ‘ఇంటి’వాడైన సుడిగాలి సుధీర్!
బుల్లితెర ప్రేక్షకులను జబర్దస్త్‌గా నవ్విస్తున్న సుడిగాలి సుధీర్ ఓ ఇంటివాడయ్యాడు. ఇప్పటివరకు అద్దె ఇంట్లో గడిపిన సుధీర్ తాజాగా ఓ కొత్త ఇల్లు కొన్నాడు. తన టాలెంట్‌ను గుర్తించి అవకాశం కల్పించిన మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు, ఈటీవీకి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశాడు సుధీర్. అదే విధంగా తనను ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టాడు. జబర్దస్త్ యాంకర్ రష్మీతో ప్రేమాయణం అంటూ మొన్నటివరకు వార్తల్లో నిలిచిన సుధీర్.. ఆ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సుధీర్‌తో లవ్ ఎఫైర్‌పై బాగా రాయండి అంటూ ఇటీవల రష్మీ కాస్త వెరైటీగా స్పందించడం గమనార్హం.
ఓ ‘ఇంటి’వాడైన సుడిగాలి సుధీర్!
Reviewed by Vikram
on
3:21:00 PM
Rating:

No comments:
Post a Comment