TELUGU DESAM PARTY MAHANADU తెలుగుదేశంపార్టీ మహానాడు


సమాజమే నా దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు

టార్గెట్‌ రత్నాచల్‌?

  • విధ్వంసానికి.. ముందే వ్యూహరచన
  • మంచినీటి క్యాన్లతో పెట్రోల్‌ నిల్వలు

దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన తుని హింసాత్మక సంఘటన వెనుక పక్కా ప్లాన్‌ ఉన్నట్టు తెలుస్తోంది. శాంతిభద్రతల సమస్యను సృష్టించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికే విధ్వంసానికి వ్యూహరచన చేశారన్న ప్రచారం సాగుతోంది. సభ జరుగుతున్నప్పుడే.. రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కడ ఉన్నదంటూ కొందరు ఆరా తీసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తమ పథకం ప్రకారం వారు.. ఆ రైలు తుని దాటి ఫర్లాంగుదూరం రాగానే సభా ప్రాంగణం నుంచి రైలు పట్టాలపైకి వెళ్లిపోయారని తెలుస్తోంది. అక్కడ కొందరు యువకులు కంకరరాళ్లు రువ్వడంతో డ్రైవర్‌ రైలు ఆపేశారు. అంతే.. ఆ అసాంఘిక శక్తులు తాము మంచినీటి క్యాన్లలో తెచ్చిన పెట్రోల్‌ను బోగీలపైనా, లోపలా చల్లి నిప్పు పెట్టినట్టు పలువురు చెబుతున్నారు. వీరంతా 30, 40 సంవత్సరాల వయస్సు కలిగిన ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అలాగే, వీరు గుంటూరు, విజయవాడ, కడప, అనంతపురం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన అసాంఘిక శక్తులుగా భావిస్తున్నారు. ఇక.. రైలుపై దాడి ఇలా కొనసాగుతుండగానే.. మరికొందరు తుని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న పాత వాహనాలు, పోలీసు జీపులపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టారు. దీంతో దాదాపు 15 వరకూ కార్లు, జీపులు కాలిబూడిదయ్యాయి. తుని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో పలు కేసులపై సీజ్‌ చేసిన 70 బైక్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. అక్కడి నుంచి నేరుగా ఆందోళనకారులు తుని పట్టణ పోలీ్‌సస్టేసన్‌, సీఐ కార్యాలయానికి చేరుకుని నిప్పు పెట్టారు. ఈ రెండు ఘటనలనూ కవర్‌ చేయడానికి వెళ్లిన ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియాపై కూడా అసాంఘిక శక్తులు విరుచుకుపడ్డాయి. వారు కొన్ని మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వారినే టార్గెట్‌గా చేసుకోవడం చర్చనీయాంశమైంది.

డ్రైవర్‌ సూరిబాబు సమయస్ఫూర్తి 
రత్నాచల్‌ ఇంజన్‌ డ్రైవర్‌గా విజయవాడకు చెందిన సూరిబాబు వ్యవహరిస్తున్నారు. ఆదివారం రైల్‌రోకో సందర్భంగా రైల్‌ను ఆపడంలోనూ ఆయన అప్రమత్తంగా వ్యవహరించారు. తుని స్టేషన్‌ నుంచి రైలు బయలుదేరిన తరువాత సుమారు కిలోమీటర్‌ దూరంలోనే రైల్‌రోకో జరిగింది. రైలు స్పీడ్‌ అందుకునే సమయంలోనే పట్టాలపై జనాన్ని చూసిన డ్రైవర్‌ వెంటనే రైల్‌ను కంట్రోల్‌లోకి తెచ్చారు. అంతేకాకుండా విజయవాడలో ఉన్న పవర్‌ కంట్రోల్‌ అధికారులకు సమాచారం అందించి విద్యుత ఆపేటట్టు సమయస్ఫూర్తితో ప్రదర్శించారు. లేకుంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.
 
నేడు రత్నాచల్‌ ఇంటర్‌సిటీ రద్దు 
రత్నాచల్‌ దహనం నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి వరకూ స్తంభించిన రైళ్ల రాకపోకలు సోమవారం కొనసాగాయి. అయితే, మంగళవారం విజయవాడ-విశాఖ-విజయవాడ మధ్య నడిచే రత్నాచల్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ (12717/12718)ను ఇరువైపులా రద్దు చేశారు. కాగా, సోమవారం ఉదయం 6.15 గంటలకు విశాఖలో బయలుదేరాల్సిన జన్మభూమి ఇంటర్‌ సిటీ తొమ్మిదిన్నరకు, 7.50 గంటలకు వెళ్లాల్సిన విశాఖ-ఢిల్లీ ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ పదకొండున్నరకు బయలుదేరేలా రీషెడ్యూల్‌ చేశారు. విశాఖ నుంచి గుంటూరు వెళ్లే సింహాద్రి ఇంటర్‌ సిటీ(17240), విజయవాడ నుంచి విశాఖ రావాల్సిన రత్నాచల్‌(12718), హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12728) సోమవారం రద్దయ్యాయి.
 
3 రోజుల క్రితమే రత్నాచల్‌కు కొత్త ఇంజన్‌ 
ఆందోళనకారుల చేతిలో ఆదివారం దహనమైన రత్నాచల్‌ ట్రైనను వెనక్కు తోసుకు వచ్చి తుని స్టేషన్‌లో రెండవ ట్రాక్‌ మీద నిలిపివేశారు. ఈ రైలుకు మూడు రోజుల క్రితమే కొత్త ఇంజన్‌ను అమర్చడం గమనార్హం. ఈ ట్రైన్‌ రోజూ విశాఖ-విజయవాడ మధ్య నడుస్తున్న సంగతి తెలిసిందే.
 
రైల్వే ప్రత్యేక కేసులు 
రైల్వే ఆస్తులకు నష్టం కలిగించినవారిపై రైల్వే చట్టాల ప్రకారం పోలీసులు ప్రత్యేకంగా కేసులు నమోదు చేస్తున్నారు. రత్నాచల్‌ ఎక్స్‌ప్రె్‌సపై దాడులకు దిగిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. రైల్వే స్టేషనలోని సీసీటీవీ ఫుటేజిలను పరిశీలించిన జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌ బృందాలు పలువురి వివరాలు సేకరించినట్లు సమాచారం. రైల్వే సిబ్బందిపై దాడి చేసిన వారిని ఇప్పటికే గుర్తించి కేసులు నమోదు చేశారు.see more in facebook
టార్గెట్‌ రత్నాచల్‌? టార్గెట్‌ రత్నాచల్‌? Reviewed by Vikram on 11:30:00 AM Rating: 5

No comments:

track info

Powered by Blogger.